Sunday, January 21, 2018

నడివేసవిలో కుంభవృష్టి


నాజీవితంలో మొట్టమొదటి సారిగా నాపుట్టినరోజుకు ఇన్ని శుభాకాంక్షలు వచ్చాయి. చిన్నతనంలో ఈ తారీకుల పుట్టినరోజుకు విలువ ఉండేదికాదు. సంబరం వైశాఖ పౌర్ణమి నాటికే. కేకులు, కేకలు, కొవ్వొత్తులూ లేవు. తలంటు పోసుకొని, కొత్తబట్టలు కట్టుకుంటే మా అమ్మ కుంకుమ బొట్టుపెట్టి హారతి ఇచ్చేది. పాయసం చేసేది. 5గురు తమ్ముళ్ళు , ఒకచెల్లెలు ఉండటంతో అందరి పుట్టినరోజులు అందరికీ పండుగలే. నా శ్రీమతి సుబ్బలక్ష్మి. నా శక్తి. పెళ్ళి అయ్యేటప్పటికి నాకు 22, తనకి 16. పెళ్ళి తరువాత కలిసి పెరిగాం. ముగ్గురు అమ్మాయిలు. వాళ్ళనాటికి రోజులు మారాయి. Date birth day , తిథుల పుట్టినరోజు. ఇంగ్లీషులో ఏమనాలో తెలియక Star birth day అనే వారు. ఇద్దరు మనుమలు కార్తికేయ, దుర్గాకుమార్. ఇద్దరు మనుమరాళ్ళు శివానీ, సంధ్య. ముఖపుస్తకం ద్వారా అనేకులు బాబాయి, పెద్దనాన్నగారు, అలా అనేక వరసలతో పిలుస్తున్నారు. ఇది చాలా సంతోష కరమైన విషయం. అందరికీ కృతజ్ఞతలు.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...