Tuesday, January 16, 2018

రామాయణం, మహాభారతం, భాగవతము, పురాణాలు మనం ఈ రోజు చదివే సాంఘికనవలలు కావు

రామాయణం, మహాభారతం, భాగవతము, పురాణాలు మనం ఈ రోజు చదివే సాంఘికనవలలు కావు. ఆ పుస్తకాలను భౌతిక,దైవిక,ఆధ్యాత్మిక ఉపరి తలాలలో చదివి అర్థంచేసుకోవాలి. ఈ విశ్వము యొక్క సృష్టి, దాని ఆరంభం, అనంతమైన కాలచక్రం, స్త్రీ పురుష తత్త్వాల పరస్పర సంబంధం, జనన మరణ చక్రం, పదునాలుగు భువనాలు, వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, భాష, అవి వ్రాయబడిన కాలాలు, దేవతలు, రాక్షసులు, ధర్మము, కర్మము, జ్ఞానము,యోగం - ఎంతో ప్రయత్నం చేస్తే గాని ఒక స్థాయి విజ్ఞానం రాదు. రాముడు సీతను మానవత్వం లేకుండా అడివికి పంపాడు. కృష్ణుడు అనేక స్త్రీలతో గడి పాడు. హరిశ్చంద్రుడు భార్యను అమ్మాడు. బ్రహ్మదేవుడు కూతురునే కామింఛాడు, రామాయణం విషవృక్షం ఇలాంటి వ్యాఖ్యానాలు, కేవలం రాసిన వారి అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని సూచిస్తాయి.
https://www.facebook.com/vallury.sarma/posts/466536656717086

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...