Tuesday, January 16, 2018

కులాంతర వివాహాలు మంచివా? కావా?

కులాంతర వివాహాలు మంచివా? కావా? అనే ప్రశ్న అర్థంలేనిది. కులాలు వచ్చినప్పటినుండీ కులాంతరాలూ ఉన్నాయి. లేకపోతే ధర్మ శాస్త్రాలలో అనులోమ, విలోమ వివాహాల ప్రసక్తే వచ్చేది కాదు.కౌరవులు యాదవులను ఎందుకు తక్కువగా పరిగణించే వారు? యాదవులు యయాతి కుమారుడు యదువు వంశీయులు. కౌరవులు ఇంకొక కుమారుడు పురు వంశీయులు. యదువు క్షత్రియరాజు బ్రాహ్మణ భార్య దేవయాని కుమారుడు. పురు మహారాజు క్షత్రియభార్య శర్మిష్ఠ కుమారుడు. అందుచేత సుక్షత్రియుడు. విలోమ వివాహము కావడం వలన యదువు బ్రాహ్మణుడు, క్షత్రియుడు కాక సూతుడు అయ్యాడు. నేటి సుప్రీం కోర్టు తండ్రికులమే కులాంతరములో పిల్లలకు వస్తుందని తీర్పు ఇచ్చింది.ఆనాటి నిర్ణయం వేరు. కులాంతరం చేసుకుంటే పిల్లలకు సంఘం దృష్టిలో ఏ కులమూ ఉండదని అర్థం చేసుకోవాలి. మతాంతరంలో సమస్యలేదు. హిందువు మతం మార్చుకుంటాడు. అప్పుడు ఇతరులకు అది మతాంతరమే కాదు.


No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...