మూడు వారాల తరువాత బెంగుళూరులోని మాఇంటికి తిరిగివచ్చాము. అనుకోకుండా ఇక్కడ అనేక వ్యవహారాలు తలకు చుట్టుకున్నాయి. బహుశా మార్చి ఒకటి వరకు ఈ పనులు పట్టవచ్చును. అప్పటివరకు ముఖపుస్తకములో పాలు పంచుకునే సమయము ఉండకపోవచ్చును. విజయవాడ, తాడేపల్లిగూడేం, ఆచంట, భీమునిపట్నం, విశాఖపట్టణం, ఎలహంకల మీదుగా జరిగిన ప్రయాణం ఆనందంతోపాటుగా శ్రమని, స్వల్ప అనారోగ్యాలను చవిచూపించింది.
ఆంధ్ర ప్రదేశ్ లోప్రతిబింబించిన మన దేశపు నేటి పరిస్థితులలో పెద్దగా చెప్పుకోవలసినది లేదుకాని వార్తలు దేశపు గతిని సూచిస్తున్నాయి.అన్నిస్థాయిలలోనూ చెప్పుకోదగ్గ అవినీతి, అధర్మము, హింస, తాండవిస్తున్నాయి. ఈ విషయంలో మా కర్నాటక కొంచేంనయమని నాకు అనిపిస్తూఉంటుంది.అఫ్జల్ గురు దేశములోని కొన్ని భాగాలలో భగత్ సింగ్ స్థాయికి చేరినట్లు అనిపిస్తుంది.ఇక హెలికాప్టరు కుంభకోణం ఏదో నాలుగు రోజుల మీడియా పండుగ.
రాష్ట్రంలో ఆధ్యాత్మికత నూతన మార్గాలు ఎంచుకుంటున్నది. ఆటోలు, టాక్సీలూ వెనకాల ప్రకటనలు జీవులకు కొత్త కాపరికిస్వాగతం పలుకుతున్నాయి. కొత్త రంగులలో అడుగడుగుకూ నూతన శిల్పశైలిలో కొత్తదేవతల దేవాలయాలు వెలుస్తున్నాయి. వారానికి 7 రోజులూ, రోజుకు 24 గంటలూ వారి భక్తి సంగీతంతో, శ్రోతలను రంజింపచేస్తున్నారు. ఇది మన సెక్యులర్ ప్రభుత్వపు విజయం. రాబోయే పాలకులను కూడా తేలికగా గుర్తింపవచ్చును. ఒకప్పుడు భిన్నత్వంలో ఏకత్వమని మన దేశాన్ని వర్ణించేవారు.ఇప్పుడు అనేకత్వమే పరిపాలిస్తున్నది. తెలుగు మాట్లాడే రాష్ట్రాన్నిఎన్నిభాగాలుగా
No comments:
Post a Comment