https://www.facebook.com/vallury.sarma/posts/492302460807172
ఒక్కొక్క సంస్కృతికి ప్రపంచాన్ని గురించిన ఒక దృష్టికోణం, ఒక అవగాహన ఉంటుంది. ఒక అమెరికాపౌరుడు, ఒక బ్రిటిష్ పౌరుడు, ఒక హిందూ భారతీయుడు, ఒక పాకిస్తానీ, ఒక ముస్లిం లేదా క్రైస్తవ భారతీయుడు, ఒక హిందూ తెలుగువాడు వీరిదృష్టికోణాల్లో భేదాలు ఉంటాయి. వారి మాటలు వినేటప్పుడు వారి నేపథ్యం గుర్తుంచుకుంటే వారి వారి మాటలు, వారి పుస్తకాలు, వారి దేశం, వారి ఊహాపోహలు సరిగా గుర్తించవచ్చు. విదేశాంగ శాఖలో అంతర్జాతీయ దౌత్య సంబంధాలలో పనిచేసే వారికి ఇది ముఖ్యం. మన విదేశ సంబంధాలు చూస్తే, “ఇది సరిగా జరుగుతున్నదా?” అనే అనుమానం వస్తుంది.
ఒక ఉదాహరణ. ఇది కోహినూర్ వజ్రానికి సంబంధించినది. ఈ వజ్రానికి పెద్ద చరిత్ర ఉంది. గుంటూరు జిల్లా, బెల్లంకొండ మండలం కొల్లూరు లో విశ్వవిఖ్యాత కోహినూరు వజ్రము దొరికింది. 1850లో ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నరు జనరల్ డల్హౌసీ నాటి మొగల్ నవాబు నుండి బలవంతంగా పుచ్చుకొని, రాణీ విక్టోరియా కు ఇచ్చాడు. 105 కారట్ల ఈ వజ్రం బ్రిటిష్ రాణి కిరీటంలో పొదగబడి ఉన్నది. నాచిన్నప్పుడు "నమో హిందు మాతా" అనే పాటలో "తాజమహలు నీదివ్య భవనమట, కోహినూరు నీజడలో పువ్వట" అనేవాక్యాలు ఉండేవి. దీని మీద భారతీయులకు ఆశ. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి బ్రిటన్ ఆ వజ్రాన్ని తిరిగి ఈయాలని భారత్ కోరుతున్నది. దీని ప్రసక్తి తిరిగి 21 ఫిబ్రవరి 2013 నాడు మన దేశాన్ని సందర్శిస్తున్న బ్రిటిష్ ప్రధాని తెచ్చారు. ఆ వజ్రం బ్రిటిష్ ఆస్తి అనీ తిరిగి ఇచ్చే ప్రశ్నలేదని ఆయన ఖండితంగా చెప్పాడు. ఇక్కడ మన, వాళ్ళ ఆలోచనా విధానంలో తేడాలు కనుపిస్తాయి. ఒకవిషయం నిజం. వాళ్ళు తిరిగి ఈయడం మొదలు పెడితే బ్రిటిష్ మ్యూజియంలో సగం మనకు ఇచ్చేయాలి. మనం దానిని కాపాడ గలమా? శ్రీకృష్ణదేవరాయలు తిరుమల శ్రీవారి కిచ్చిన నగలే మనం కాపాడలేక పోయాము. ప్రతీ ఆలయంలో ఉన్న ప్రాచీన పంచలోహ విగ్రహాలు రోజూ దొంగిలింపబడుతున్నాయి. ఇవి ఎన్ని ఉన్నాయో కూడా మనకు తెలియదు.
ఈ కోహినూరు వజ్రము ప్రశ్న మనవిలేఖరులే అడిగి ఉంటారు. ఆ విషయం మన పత్రికలు వ్రాయలేదు. ఆయన 1919లో అమృతసర్ జలియన్ వాలా బాగ్ లో జరిగిన హత్యా కాండకు సంతాపం తెలుపడానికి వచ్చాడు. అలా వచ్చిన మొదటి బ్రిటిష్ ప్రధాని ఆయన. ఆ సమయం లో ఈ ప్రశ్న అడగడం మన విలేఖరుల తెలివితక్కువ. వారికి శిక్షణ ఉండదు. ఏలా, ఏమి మాట్లాడాలో తెలియదు. ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఆడం స్మిత్ తో మొదలైన ఆధునిక ఆర్థిక శాస్త్రం బ్రిటన్ లోనే పుట్టింది. సంతాపానికి ఖర్చు లేదు. వజ్రము విషయం వేరు. ఇది మన వాళ్ళకు తెలియదు

Nandiraju Radhakrishna "నమో హిందు మాతా" అనే పాటలో "తాజమహలు నీదివ్య భవనమట, కోహినూరు నీజడలో పువ్వట" అనేవాక్యాలు ఉండేవని ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరికి తెలుసు.అసలు అ పాటే తెలీదు కదా.. అందుకనే శర్మగారు, ఈ బరువు బాధ్యతలు మనం ఎటూ మోయలేమని జ్ఞానోదయం కలిగే మన నాయకులు ఆ బాధ్యతలను అమెరికాకు, బ్రిటన్‌కు, చైనాకు, పక్కనున్న పాకీస్తాన్‌కు గంపగుత్తగా అప్పగించి సింహాసనాల్ని మాత్రం అట్టిపెట్టేసుకుంటున్నారు. వాటిని కాపాడే బాధ్యత కూడా విదేశాలకు, అక్కడి దేవుళ్ళకు ముందుగానే రాసిచ్చేశారు. కాశ్మీరు ఆంశం ఇప్పటికీ తేల్చలేకే కదా..భారత భూభాగం విషయమే వదిలేశాం. మన తిరుపతి వెంకటేశ్వర స్వామికి కొన్నేళ్ళలో హెడ్ క్వార్టర్స్ అమెరికా, బ్రిటన్, ఇటలీలోనో, వాటికన్ కో మారినా ఆశ్చర్య పడనక్కరలేదు.
మన విలేఖరులకు ఆ తెలివి ఉంటే ఇక అనుకోవడమెందుకు? బ్రిటిష్ ప్రధానిని ఆ సమయం లో ఈ ప్రశ్న అడగడం మన విలేఖరుల తెలివితక్కువ. వారికి శిక్షణ ఉండదు. ఏలా, ఏమి మాట్లాడాలో తెలియదు.గుడ్డిలో మెల్ల అన్నట్లు తెలుగు వారికంటే ఢిల్లీ వారు కొంత నయం లేండి. ఇక్కడ ఉద్యోగం కంటే ఊడిగం చేసేవారు ఎక్కువ. ఇవ్వాళ ప్రధాని హైదరాబాద్ పేలుళ్ళ ఘటనా స్థలాన్ని సందర్శించారు. అక్కడ మా విలేఖరులకు ఆస్కారం లభించలేదు, లేకుంటే తప్పకుండా తెలంగాణా విషయాన్ని ప్రస్తావించి ఉండే వారు. ఇక్కడ పత్రికలు కూడా వర్గాలుగా, పార్టీలుగా చీలిపోయాయి

జాజి శర్మ మనము మనకున్నవి కాపాడుకుంటే చాలని నిన్ననే కాశ్మీర్ మిద ఓ చిన్న వ్యాసము మొదలు పెట్టాను. దాదాపు ఇదే ధోరణి లో సాగినది. మరో పదినిమిషాలలో ఆ వ్యాసము మీ ముందుకు వస్తుంది.
Gopala Krishnam Raju Thank you for sharing such 'unknown' things with FB users. It's all about our culture. Each one of us should 'think' about it. it should be wake up call to all of us if not one day real 'bharateeyudu' will come. We all in 'sleep' mode. I really like each letter, word of your post. Once again big 'Thank You' ! Good day.

No comments:
Post a Comment