Thursday, January 18, 2018

Manohar Borancha 6:48pm Feb 20

"2030 నాటికి తెలుగు భాష అంతరించి పోతుంది ." ఐక్యరాజ్య సమితి . " ఎవడురా ఈ మాట అన్నది ? " అనే ఉక్రోషం మనకు లేదా !? ( రేపు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం .)
V V S Sarma
ఇది ఆవేశపడే విషయం కాదు. అలా అని తేలికగా కొట్టిపారేసే విషయమూకాదు. ఇది మన సమాజ పరిణామంలో అంతర్భాగం. అనేక దిశలనుండి మనం ఎదుర్కొంటున్న దాడుల ఫలం. ఈ దాడి నేటిది కాదు. వేయి సంవత్సరాల నుండి జరుగుతూ ఉన్నది. గత శతాబ్దంలో వైజ్ఞానిక విప్లవంతో వేగం పుంజుకున్నది. ఇది నావంటి వాళ్ళు గత 65 సంవత్సరాలుగా గమనిస్తున్న పరిణామం. సృష్టిలో పరిణామం అంతర్భాగం. మనం చూస్తుండగా అనేక రకాల పాములూ, పక్షులు అంతరించిపోయాయి. డినోసార్స్ దాకా వెళ్ళక్కరలేడు. 1950 లో వినపడ్డ తెలుగు నేడు వినపడడంలేదు. నేటి తెలుగు 2030లొ వినబడదు.ఇది సత్యం. తెలుగు చలనచిత్రాలకు తెలుగు శీర్షికలు లేవు. ఒకటి వస్తే వింత. వార్తలు పోయి న్యూస్ వచ్చి చాలాకాలమైనది. తమిళ కన్నడ దేశాలతో పోలిస్తే మనం భాషను అశ్రద్ధ చేసినట్లు కనబడుతూనే ఉన్నది.
తెలుగు ఒక రోజున అదృశ్యంకాదు.కాని దాని పరిధి తగ్గిపోతున్నది.నాచిన్నప్పుడు తెలుగు పుస్తకాలు సుమారు 5వేల ప్రతులు ముద్రించే వారు. ఈ నాడు ఒకటి లేదా రెండువేలు. రచయితల కు వ్రాయడం ఒకయెత్తు, ప్రచురించడం ఒక యెత్తు, వాటిని మిత్రులకు పంచడం మరియొక యెత్తు గా మారింది. ఒకే ఒక రంగంలో తెలుగు ఇంకా జీవించి ఉన్నది - అది తెలుగు వార్తాపత్రికల రంగం. నగరాలలో ఎవరింటిలోనూ తెలుగు పుస్తకాలు కనబడడంలేదు. వ్యావహారికభాష పేరుతో మొదలైన ఉద్యమం ఆఖరకు గ్రామ్య భాష, బజారు భాషలుగా పరిణామం చెందినది. అక్షరాలు లుప్తమౌతున్నాయి. వాటితో ఉచ్చారణ కూడా మారిపోయింది. మళ్ళీపెళ్ళి ఇప్పుడు మల్లీపెల్లి యే. చ'లిమిడి,చ'వితి, చ'క్కదనం వంటి మాటలు చె ధ్వనించే రీతిగా పలుకుతున్నారు. ఋణం రుణమే.
సనాతనధర్మం, తెలుగు, సంస్కృత భాషలూ, వీటి వ్యాప్తి హిందూమతాంతర భారతదేశంలో నిశ్చయంగా తగ్గుతున్నది. ఐలయ్య వంటి అన్యమత మేధావుల ఆశయంఇదే. దళితులకు (అంటే ముఖ్యంగా క్రైస్తవులకు) తెలుగు యొక్క సాంస్కృతిక అవసరం లేదు. భాషకు, ధర్మానికి, సంస్కృతికి ఉన్న సంబంధం గమనించాలి. ఒకదానిని మాత్రమే రక్షించడం కుదరదు.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...