Friday, January 19, 2018

ఫెమినిజం గురించి నేను వ్రాస్తే ఎలాఉంటుంది?



అసలు ఇజం అనే తోకతో వచ్చే ప్రతిపదమూ నాకు పడదు. మొదటిది హిందూయిజం. ఎవడు పెట్టాడో ఈ పేరు, మనకు అతుక్కు పోయింది? హిందూ అంటె సింధు. సింధునది ఉన్నదేశంలో ఉన్నమనుషుల మతం. 1947 వరకు హిందుస్తాన్ అన్న పదము, హిందూ దేశమనే పేరు అర్థవంతంగా ఉండేవి. ఇప్పుడు ఆదేశాన్నే పాకిస్తాన్ అంటున్నారు.వాళ్ళే నిజమైన హిందువులు. సింధునాగరికత వారిదే. సంస్కృతం వ్యాకరణ వేత్త పాణిని అక్కడవారే. స్వాట్ లోయలో ఒకనాడు ఋగ్వేదం ప్రతిధ్వనించేదట. హిందూత్వాన్నే ఇప్పుడు పాకిస్తానియత్ అంటున్నారు. మనం అరబిక్ లో హవాలా అంటున్నదాన్ని వాళ్ళు ఇంకా సంస్కృతంలో హుండీ అంటున్నారు. ఫెమినిజం గురించి ఆడవాళ్ళు మాత్రమే వ్రాయాలా? అసలు మన మతంలో త్రిమూర్తులకంటే స్త్రీ మూర్తి, ముగురమ్మల మూలపుటమ్మ ఆది పరాశక్తి, వేల నామాలతో వ్యవహరింపబడే లలితాదేవియే గొప్ప అని ఒప్పుకున్నాం. ఆవిడ స్థానం మనబ్రహ్మాండానికి అవతల. పాశ్చాత్యుల మతమైన క్రైస్తవంలో అన్యాయంగా దేవుడు ఆదాముని సృష్టించి అతని ఎముకని అవ్వగా తయారుచేశాడట. ఫెమినిజం అని ఇప్పుడు గోలపెడితే ఏమి లాభం? మతం మార్చుకుంటే తప్ప వారి ఆత్మగౌరవం రక్షింపబడదు. ఫెమినిజంని ఆదిశక్తి మతం అనాలి. ఇక మాఇంట్లో ఆడువారిదే రాజ్యం. ముగ్గురు అమ్మాయిలు అంటే ఊహించుకోండి. పురుషాధిక్య సమాజం అంటే నాకు తెలియదు. అలాగే కమ్యూనిజం సోషలిజం, సెక్యులరిజం వంటివి కూడా!
జాజి శర్మ బాగుంది కాని సార్, మిమ్మల్ని డామినేట్ చేసే జ్ఞానం వారికిచ్చి ఇప్పుడనుకుంటే ఎలా? సానియా మిర్జా కి చెప్పాలి అనలైన హిందువును పెళ్ళాడిన విరవనితవి నువ్వు అని.P Mallikarjuna Rao Feminism is not monolithic. There are divergent views about it. There are different shades of Feminism; the most radical of them being Lesbianism. There are many moderates who are opposed this creed even in the West. Like many others this is also a Western transplant in India.

No comments:

Post a Comment

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...